లేబర్ కోడ్ లు రద్దు చేయాలి: ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి – సిఐటియు పిలుపు

పాలకొండ వెబ్ న్యూస్:​ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని మరియు ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. బుధవారం పాలకొండ నగర పంచాయతీ ఆవరణలో జరిగిన ప్రచార కార్యక్రమంలో సిఐటియు జిల్లా అద్యక్ష, కార్యదర్శిలు దావాల రమణారావు మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల సేవలో నిమగ్నమై కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. కొత్త లేబర్ కోడ్ల వల్ల కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ పేదలకు ఆసరాగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని వారు కోరారు. ఈ పోరాటంలో భాగంగా గురువారం ఉదయం 9:30 గంటలకు పాలకొండ దుర్గ గుడి సెంటర్ వద్ద జరిగే నిరసనలో కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పాలకొండ కమిటీ ప్రతినిధులు వై హరిబాబు, సిహెచ్ సంజీవి, పి సాయి, బి సురేష్, కే రాజేష్, వై సురేష్, పి సతీష్ మరియు ఇతర కార్మికులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ పాలకొండలో భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి అర్తమూడి లక్ష్మణరావు మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలని, నిలిపివేసిన క్లైమ్ నిధులు విడుదల చేయాలని మరియు 12/14 మెమోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సెస్ నిధులను కార్మికుల సంక్షేమానికే ఖర్చు చేయాలని, పిల్లలకు స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెదగాడ రమణ, ఏ ఈశ్వరరావు, జగన్, బి రాము పాల్గొన్నారు.

Post a Comment

0 Comments