నాగావళి తీరంలో అమృత మృత్యుంజయశ్వరస్వామికి చక్రతీర్ధ స్నానం

పాలకొండ వెబ్ న్యూస్: పాలకొండ పట్టణం నక్కలపేటలోని సాయిదుర్గానగర్‌లో వెలసిన షిరిడి సాయిబాబా సమేత సకల దేవతాలయ ప్రాంగణంలోని లలితా మహాత్రిపుర సుందరి సమేత అమృత మృత్యుంజయశ్వరస్వామి వారికి సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 16వ తేదీన ఉదయం 9 గంటల నుండి అంపిలి గ్రామంలోని నాగావళి నదీ తీరంలో స్వామివారికి శాస్త్రోక్తంగా చక్రతీర్ధ స్నానం, అనంతరం విశేష అభిషేకాలను నిర్వహించనున్నట్లు వల్లా కొండబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. నదీ తీరంలో జరిగే ఈ విశేష స్నాన ఘట్టానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Post a Comment

0 Comments