పాలకొండ వెబ్ న్యూస్: సరదా చదువులు ఆధ్వర్యంలో వీరఘట్టం, పాలకొండ, గరుగుబిల్లి, జిఎం వలస, రేగిడి ఆముదాలవలస మరియు బూర్జ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం సత్య సాయి టాలెంట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఐదవ తరగతి నుండి ఒకరు, ఎనిమిదవ తరగతి నుండి ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి గూగుల్ షీట్‌లో వివరాలు నమోదు చేయాలని ప్రధాన ఉపాధ్యాయులను కోరారు. మార్చి మొదటి వారంలో పాలకొండలో నిర్వహించే ఈ పరీక్షకు ఎటువంటి రుసుము లేదు. తెలుగు, ఇంగ్లీష్, గణితం, సైన్స్ సబ్జెక్టులలో ప్రతిభ కనబరిచిన మొదటి పది మందికి మౌఖిక పరీక్ష నిర్వహించి నగదు ప్రోత్సాహకాలు, మెమెంటోలు అందజేస్తారు. గత నవంబర్‌లో పదవ తరగతి విద్యార్థులకు విజయవంతంగా పరీక్ష నిర్వహించినట్లు కన్వీనర్ ఎన్వి రమణ, కో కన్వీనర్ మరడాన సంపత్ కుమార్ తెలిపారు.
0 Comments