పాలకొండ పట్టణంలో గత కొన్ని రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న గారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు నేటితో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన ఈరోజు ఆలయ ప్రాంగణంలో మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగింది. పాలకొండ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించారు.
మంగళవాయిద్యాలు, వేద ఆశీర్వచనాలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. విగ్రహ ప్రతిష్టాపన అనంతరం జరిగిన ఈ పూర్ణాహుతి మరియు కుంకుమ అర్చన కార్యక్రమాలతో ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తయ్యాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.news by: BSS Prasad
0 Comments