సిపిఐ సీనియర్ నేత నెల్లి సూర్యనారాయణ కన్నుమూత

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 26-04-2026:​భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ నెల్లి సూర్యనారాయణ అనారోగ్యంతో పాలకొండ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు. నమ్మిన సిద్ధాంతం కోసం ఎర్రజెండా నీడన పేదల పక్షాన పోరాడిన ఆయన అనేక భూపోరాటాలకు నాయకత్వం వహించారు. అమ్మచెరుగూడ, జంపరకోట వంటి ప్రాంతాల్లో గిరిజనులకు సాగుభూమి దక్కేలా కృషి చేశారు. నిలువ నీడ లేని సంచార జీవుల కోసం ఆయన చేసిన పోరాట ఫలితంగా లబ్ధిదారులు తమ నివాస ప్రాంతానికి ఎన్ఎస్ఎన్ కాలనీగా పేరు పెట్టుకుని కృతజ్ఞత చాటుకున్నారు. ఆయన పార్థివ దేహానికి ఉత్తరావిల్లి మురళీమోహన్రావు, సీమల కృష్ణారావు, ఖండాపు ప్రసాదరావు, చేబోదుల లక్ష్మీనారాయణ నివాళులర్పించారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments