పాలకొండ గ్రంథాలయంలో ప్రారంభమైన వేసవి విజ్ఞాన శిబిరం

​పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 28 ఏప్రిల్, 2026: ​పౌర గ్రంథాలయ శాఖ ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు పాలకొండ శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం గ్రంథాలయ అధికారి బబ్బురు గణేష్ బాబు అధ్యక్షతన ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ శిబిరం ఏప్రిల్ 28 నుండి జూన్ 6 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు, యోగా గురువు కె.జనార్ధనరావు మాట్లాడుతూ పుస్తకాలు ఉన్న చోటే ప్రజ్ఞ ఉంటుందని, పఠనం ద్వారానే సమాజం పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు. ఇల్లు ఎంత పెద్దదన్నది కాకుండా అందులోని పుస్తకాలే ఆ ఇంటి విలువను నిర్ణయిస్తాయని ఆయన వివరించారు.

​ఈ శిక్షణలో విద్యార్థులకు చిత్రలేఖనం, మట్టి బొమ్మల తయారీ, నీతి కథలు, కవితలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు యోగా నేర్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో డ్రాయింగ్ మాస్టారు జి. మురళి, రిటైర్డ్ ఎంపిడిఓ వి. మృతుంజయరావు, లెక్చరర్ ఆర్. మల్లేసు, సహాయకుడు ఈశ్వర్ పాల్గొన్నారు. రేపటి తరగతుల కోసం విద్యార్థులు వంద పేజీల తెల్ల పుస్తకం, కలర్ పెన్సిల్స్, హెచ్‌బి, టుబి పెన్సిల్స్, వాటర్ కలర్స్, కత్తెర, కలర్ పేపర్స్ మరియు ఫెవికల్ గమ్ వెంట తెచ్చుకోవాలని సూచించారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments