విశాఖపట్నం సిరిపురంలోని ఫోర్ లైన్ హోటల్లో శనివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సమావేశంలో పార్వతీపురం కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిమిడి చంద్రకుమార్ రాష్ట్ర స్థాయి అప్రిసేషన్ అవార్డు అందుకున్నారు. ప్రజలకు ఉన్నతమైన న్యాయ సేవలు అందించినందుకు గుర్తింపుగా రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి. రామకోటేశ్వర రావు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా పాలకొండ శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దూబ పద్మావతి, ఎన్ టి ఆర్ వైద్య సేవ విజయనగరం, పార్వతీపురం జిల్లాల మేనేజర్ దూబ రాంబాబు ఆయనకు అభినందనలు తెలిపారు. తోటి న్యాయవాదులు, మిత్రులు చంద్రకుమార్ విజయాన్ని కొనియాడారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని చంద్రకుమార్ పేర్కొన్నారు.
news by: BSS Prasad
0 Comments