జ్యోతిరావు పూలే ఆశయ సాధనలో పయనిద్దాం

​పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 11-04-2026: పాలకొండ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. నియోజకవర్గ ఇన్చార్జ్ పడాల భూదేవి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి టౌన్ పార్టీ అధ్యక్షుడు గుమ్మడి సింహాద్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పడాల భూదేవి మాట్లాడుతూ ఆధునిక యుగ తథాగతుడైన పూలేను అంబేద్కర్ తన గురువుగా భావించారని గుర్తుచేశారు. 1827లో జన్మించినపూలే అణచివేతకు గురైన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మజ్జి జయశంకర్, యామల రత్నకుమారి, చొంగ శివానంద్, మోర మోహన్ రావు, ఆకుల కుమార్, కర్నాన గణేష్ నాయుడు, పప్పల మహేశ్వరరావు, రౌతు రామకృష్ణ, పిన్నింటి వెంకటరమణ, మొకలింగం, మక్క దుర్గారావు, దుమ్ముది దుర్గారావు, గుమ్మడి కృష్ణ, గుమ్మడి శివ, టి సూర్యారావు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments