పాలకొండ పట్టణంలో ఒక అపూర్వ కలయిక చోటుచేసుకుంది. పాలకొండ డిగ్రీ కళాశాలలో 1988-91 కాలంలో బిఏ డిగ్రీ అభ్యసించిన పూర్వ విద్యార్థుల గెట్ టుగెదర్ కార్యక్రమం ఆదివారం నాడు అయ్యప్ప శంకర్ రెసిడెన్సిలో ఘనంగా జరిగింది. డిగ్రీ పూర్తి చేసి ఇన్నేళ్లు అయిన సందర్భంగా మిత్రులంతా ఒకచోట చేరి తమ పాత జ్ఞాపకాలను, గత స్మృతులను ఎంతో ఆనందంగా నెమరువేసుకున్నారు. ఈ బ్యాచ్‌కు చెందిన పలువురు ప్రస్తుతం సమాజంలో ఉద్యోగులుగా, వ్యాపారవేత్తలుగా, రాజకీయ నాయకులుగా ఉన్నత స్థానాల్లో స్థిరపడటం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమ విశేషాల్లో భాగంగా బాసూరు శివశంకర ప్రసాద్ స్థానిక శివాలయాలపై పరిశోధనాత్మకంగా రచించిన పాలకొండ పంచ శివలింగ వైభవం అనే పుస్తకాన్ని ఆన్‌లైన్ వేదికగా ఆవిష్కరించారు. సమాజానికి భక్తిభావాన్ని, చరిత్రను పరిచయం చేసేలా ఈ పుస్తకాన్ని అద్భుతంగా రచించినందుకు తోటి మిత్రులంతా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా సమాజానికి ఉపయోగపడే మరిన్ని మంచి కార్యక్రమాలను తమ బ్యాచ్ తరఫున ఉమ్మడిగా చేపడతామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు కొట్టిస రాజశేఖర్, బాసూరు శివశంకర ప్రసాద్, కనపాక సూర్యప్రకాశరావు, దుప్పాడ రాజశేఖర్, వి సోమశేఖర్ నాయుడు, ఆర్ లలిత, టీ నాగభూషణరావు, బృంద, పోలి నాయుడు, ఐ ఆదినారాయణ, విశ్వేశ్వరరావు, కురిటి బాలకృష్ణ, టి. శ్రీనివాసరావు, ఎస్ శ్రీనివాసరావు, ఎన్.తిరుమలరావు జి వెంకటరమణ జి దుర్గాప్రసాద్ మీసాల గోపాలరావు కే లక్షము జి అప్పలనాయుడు, పి జయ శ్రీ కుమారి బి విజయలక్ష్మి బి ప్రసన్నకుమారి ఎస్ ధనలక్ష్మి ఎం శాంతి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
0 Comments