పాలకొండలో ఘనంగా ప్రారంభమైన ఎన్‌జీకే టోర్నమెంట్

పాలకొండ వెబ్ న్యూస్, మే 15:

ఎన్‌జీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్‌జీకే టోర్నమెంట్ పాలకొండ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణకు, కూటమి నాయకులకు పూర్ణ కలశము ద్వారా నిర్వాహకులు, క్రీడాకారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు క్రీడాజ్యోతిని వెలిగించి ఆటలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయకృష్ణ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు లోనుకాకుండా క్రీడల వైపు మళ్లించాలనే సదుద్దేశంతో ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆటలను నిష్పక్షపాతంగా జరపాలని, క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనుకున్నట్లుగానే నాలుగు మండలాల హెడ్ క్వార్టర్లలో మండల స్థాయి ఆటలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.

​మొదటిరోజు పాలకొండలో జరిగిన మ్యాచ్ లలో పనుకువలస నాగ వంశపు వీధి, శ్రీకృష్ణ యూత్ లు విజయం సాధించాయని నిర్వాహకులు తెలిపారు. నియోజకవర్గ సమాచారం మేరకు ఈరోజు భామినిలో నాలుగు, సీతంపేటలో మూడు, వీరఘట్టంలో మూడు, పాలకొండలో రెండు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కర్నేన అప్పలనాయుడు, స్థానిక ఎంపీపీ భాను సుధాకర్ తో పాటు కూటమి నాయకులు, టోర్నమెంట్ నిర్వాహకులు నెల్లి వెంకటరమణ, కొండ దాడి రాజేష్, చందు, సురేష్, మురళి, రమణ పాల్గొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments