సంపత్ సాయి నగర్ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

పాలకొండ వెబ్ న్యూస్, మే 14, 2026: పాలకొండ మున్సిపాలిటీ ఏడవ వార్డు పరిధిలోని సంపత్ సాయి నగర్ కాలనీవాసులు తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. గత పది సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్న తమకు నిత్యం దోమల మరియు పాముల బెడద వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చొరవతో ఇప్పటికే కాలనీ మెయిన్ రోడ్డుకు ఇరువైపులా కాలువ పనులు పూర్తయినప్పటికీ, ఇంకా సుమారు ఆరు సిసి రోడ్లు మరియు వాటికి అనుబంధంగా ఉండాల్సిన డ్రైనేజీ పనులు పెండింగ్‌లో ఉన్నాయని వారు వివరించారు. కాలనీవాసుల తరఫున అరకు పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధి గంటా సంతోష్ కుమార్, పాలకొండ ఎంపీపీ ప్రతినిధి బొమ్మాలి భాను సుధాకర్, వైస్ఎం పీపీ వాకముడి అనిల్ కుమార్, నెల్లి వెంకటరమణ, గిరడ రామారావు, మజ్జి రామకృష్ణ వినతి పత్రాన్ని అందజేశారు. కాలనీవాసుల విన్నపంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ పెండింగ్‌లో ఉన్న సిసి రోడ్లు మరియు డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments