రేపు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ వినతిపత్రాల సమర్పణ

​పాలకొండ వెబ్ న్యూస్, 17.05.2026:

​ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై రేపు అన్ని కలెక్టరేట్లలో వినతిపత్రం సమర్పించాలని ఎంప్లాయిస్ యూనియన్ పిలుపునిచ్చింది. పాలకొండ ఆర్టీసీ బస్సు డిపో వద్ద రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండవ రోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ సెక్రటరీ భాసురు కృష్ణ మూర్తి మాట్లాడుతూ ప్రజారవాణా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలని, ఆస్తుల ప్రైవేటీకరణ, విద్యుత్ బస్సుల కోసం డిపోల ఖాళీ విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. స్త్రీ-శక్తి పథకం కోసం కొత్త బస్సులు కొనాలని, ఖాళీలు భర్తీ చేయాలని, జీవో 88 రద్దు చేయాలని కోరారు. పాత టిమ్స్ స్థానంలో కొత్తవి ఇవ్వాలని, జీతాలు, పీఆర్సీ, డీఏ అరియర్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్యాయంగా సస్పెండ్ అయిన వారిని విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎస్.ఎన్. రాజు, mvs నారాయణ, ccs డెలీగేటూ gv. బాబు, mv సాగర్, vv రమణ, BR కుమార్, sr కుమార్, అలిబేగ్, vr నాయుడు, kv రమణ, ఇర్రి శంకర్రావు, y. లక్సమనరావు, gvs కుమారి, BS కుమారి, PD లక్ష్మి, RANaidu, AVRao, DK రావు, RUM రావు, శీను, అప్పారావు, ఐ రమణ మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments