నగర పంచాయతీలో అశాస్త్రీయంగా వార్డుల విభజన: కమిషనర్‌కు వినతిపత్రం అందజేత

పాలకొండ వెబ్ న్యూస్, 23 మే 2026:

నగర పంచాయతీ పరిధిలో వార్డుల విభజనపై తీవ్ర గందరగోళం నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా, అశాస్త్రీయంగా వార్డుల విభజన జరిగిందని స్థానిక నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నగర పంచాయతీ కమిషనర్‌కు గౌరవ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మరియు మాజీ కౌన్సిలర్స్ కలిసి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. వార్డుల సరిహద్దుల నిర్ణయంలో ఎలాంటి శాస్త్రీయత పాటించలేదని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వారు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి మార్పులు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి లోపాలను సరిదిద్దాలని, ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా వార్డుల పునర్విభజన ప్రక్రియను తిరిగి చేపట్టాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments