పాలకొండ శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం

​పాలకొండ వెబ్ న్యూస్, 23 మే 2026:

​పాలకొండ శాఖా గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా గ్రంథాలయాధికారి బబ్బురు గణేష్ బాబు అధ్యక్షతన తెలుగు భాషలో శతకపద్యాలు అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, తెలుగు కవి, సంస్కృత పండితులు బౌరోతు శంకరరావు హాజరయ్యారు. గ్రంథాలయానికి వచ్చిన విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ శతక పద్యాల ప్రాముఖ్యతను వివరించారు. తాను స్వయంగా రచించిన శంకర శతకము లోని పద్యాలను విద్యార్థుల చేత తేలికైన తెలుగులో చదివించి, ఎంతో రాగయుక్తంగా పాడించారు. ఈ వేసవి విజ్ఞాన శిబిరంలో ఉపాధ్యాయులు నగేష్ కుమార్, రిటైర్డ్ టీచర్ వెంకటరమణతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments