కేంద్ర కేబినెట్ ప్రకటించిన ఖరీఫ్ పంటల మద్దతు ధరలు రైతులను వంచించేలా ఉన్నాయని అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది వరి క్వింటాకు 2369 రూపాయలు ఉండగా, ప్రస్తుత సీజన్ కు 2441 రూపాయలు మాత్రమే నిర్ణయించడం అంటే కేవలం 72 రూపాయలు మాత్రమే పెంచడమని ఆయన విమర్శించారు. ఒకవైపు ఎరువుల ధరలు బస్తాకు 300 రూపాయల వరకు పెరగడం, డీజిల్ మరియు కూలీ రేట్లు ఆకాశాన్ని తాకుతుంటే, ఈ మూడు శాతం పెంపు ఏ మూలకు సరిపోదని పేర్కొన్నారు. ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం పెట్టుబడిపై 50 శాతం అదనంగా కలిపి క్వింటాకు 2700 రూపాయలు ఇవ్వాల్సి ఉండగా, కేంద్రం ఆ దిశగా అడుగులు వేయలేదన్నారు. వ్యవసాయ అధికారులు డీలర్లతో కుమ్మక్కై ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, దీనివల్ల ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రైతులు 60 కోట్ల వరకు నష్టపోతున్నారని ప్రసాదరావు ఆరోపించారు.
news by: BSS Prasad
0 Comments