గ్రంథాలయ వేసవి విజ్ఞాన శిబిరంలో జిల్లా కార్యదర్శి వి.వి.జి.ఎస్. శంకర రావు

పాలకొండ వెబ్ న్యూస్, మే 13, 2026: స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాన్ని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా కార్యదర్శి వి.వి.జి.ఎస్. శంకర రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని శాఖా గ్రంథాలయాల్లో దాతల సహకారంతో విద్యార్థులకు విజ్ఞానం, సంస్కృతిని పెంపొందించేలా ఆటలు, పాటలు, డ్రాయింగ్ మరియు క్విజ్ పోటీలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎండ బారిన పడకుండా గ్రంథాలయాల్లో గడుపుతూ మంచి బుద్ధులు నేర్చుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాఖా గ్రంథాలయాధికారి బబ్బురు గణేష్ బాబు పాల్గొని శిబిరం విశేషాలను వివరించారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments