రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కల్యాణ మహోత్సవం - జూన్ 11న నిర్వహణ

​పాలకొండ వెబ్ న్యూస్, 10-06-2026: పాలకొండ అన్నవరంలో కొలువుదీరిన విజయ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకను జూన్ 11న గురువారం సాయంత్రం ఐదు గంటలకు అధిక జ్యేష్ఠ బహుళ ఏకాదశి తిథి నాడు నిర్వహించ నున్నారు. లోకకల్యాణం మరియు సర్వజన సుఖసంతోషాల కొరకై జరిపించబోయే ఈ పరమ పవిత్రమైన కల్యాణ మహోత్సవంలో భక్తులు యావన్ మంది తమ కుటుంబసమేతంగా పాల్గొనవలసిందిగా ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. స్వామివారి కల్యాణ వైభవాన్ని కనులారా వీక్షించి, దివ్య కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని భక్త బృందం విజ్ఞప్తి చేసింది. కల్యాణోత్సవాన్ని వీక్షించినా, అందులో పాల్గొన్నా సకల దోషాలు తొలగి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు చేకూరుతాయని నిర్వాహకులు తెలిపారు.

 పాలకొండలో గల ఆలయాల సమాచారం కోసం క్లిక్ చేయండి

https://palakondatemples.blogspot.com

Post a Comment

0 Comments