రైతుల సాగునీటి సమస్యలపై సబ్ కలెక్టర్ కు వినతి

​పాలకొండ వెబ్ న్యూస్, 10-06-2026:

​పాలకొండ మండలం వెలగవాడ స్వర్ణ పంచాయితీ పరిధిలోని పి.ఆర్.రాజపేట గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు, ఇన్నోవేషన్ ఫార్మర్ ఖండపు ప్రసాదరావు మరియు స్థానిక రైతులు కలిసి పాలకొండ సబ్ కలెక్టర్ కార్యాలయం ఏ.ఓ కు ఒక వినతిపత్రం సమర్పించారు. పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో తోటపల్లి ఎడమ కాలువ ద్వారా పాలకొండ శివారు ప్రాంతానికి సాగునీరు అందడం లేదని వారు పేర్కొన్నారు. ముప్పై కిలోమీటర్ల కాలువ పరిధిలో డిస్ట్రిబ్యూటరీలకు షట్టర్లు లేవని, పి.ఆర్.రాజపేటలోని పద్మనాభచెరువు ద్వారా సాగునీరు సరఫరా చేసే మూడు మదుములు శిథిలావస్థకు చేరాయని వివరించారు. ఈ సమస్యలను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, వారు స్పందించి జలవనరుల శాఖ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారని తెలిపారు. రెండు, మూడు రోజుల్లోగా జలవనరుల శాఖ మరియు రైతులతో సమావేశానికి తేదీ నిర్ణయించాలని వారు సబ్ కలెక్టర్ ను కోరారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments