జూన్ 13నపాలకొండ టౌన్‌ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేత

పాలకొండ వెబ్ న్యూస్, 12.06.2026:
​పాలకొండ సబ్‌స్టేషన్‌లో అత్యవసర మరమ్మతుల దృష్ట్యా శనివారం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. సబ్‌స్టేషన్‌లో సాంకేతిక సమస్యతో విఫలమైన వై-ఫేజ్ సిటిని మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ అత్యవసర పనుల కారణంగా జూన్ 13న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు కార్యనిర్వహక ఇంజనీర్ కే.విష్ణు మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. మరమ్మతు పనులకు వినియోగదారులు అంతా గమనించి సహకరించాలని ఆయన కోరారు. పనులు పూర్తయిన వెంటనే సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

​పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments