సీతంపేట శ్రీవెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం యోగ ఆంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యోగ గురూజీ ధనుంజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యోగ సాధకులు అంతర్జాతీయ యోగ దినోత్సవ ప్రోటోకాల్ ఆసనాలను ఎంతో ఉత్సాహంగా సాధన చేశారు. ఈ సందర్భంగా యోగ మాస్టర్ రామ్మోహన్ పాల్గొని మానవ జీవితంలో యోగ ప్రాముఖ్యతను, నిత్య జీవితంలో దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విశేష కార్యక్రమంలో ఋషి యోగ కేంద్ర సభ్యులు, ఆలయ ఈఓ మరియు ఆలయ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in
0 Comments