పాలకొండ వెబ్ న్యూస్, జూన్ 29, 2026:
ఆంధ్రప్రదేశ్లో ఏపీఈఏపీ సెట్-2026 ఫలితాల కొరకు లక్షల మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ పరీక్ష ఫలితాలు ఈ నెల 30న మంగళవారం నాడు విడుదల కానున్నాయి. విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఈఏపీసెట్ చైర్మన్, జేఎన్టీయూకే వైస్ ఛాన్స్లర్ సీఎస్ఆర్కే ప్రసాద్ ఆదివారం వెల్లడించారు. మే 12 నుంచి 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు 3.29 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నాటికే ఫలితాలు వెలువడాల్సి ఉన్నప్పటికీ, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటం వల్ల ఆలస్యమైంది. ద్వితీయ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు, సీబీఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు పూర్తిస్థాయిలో వచ్చే వరకు ఆగాల్సి వచ్చింది. ప్రస్తుతం సీబీఎస్ఈ రివైజ్డ్ ఫలితాల ప్రక్రియ తుది దశకు చేరడంతో అధికారులు జూన్ 30న ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
0 Comments