ట్రైబల్ వెల్ఫేర్ కాంట్రాక్టు ఉపాధ్యాయుల రెన్యువల్స్ జీవో విడుదల: రాష్ట్ర యూనియన్ హర్షం

పాలకొండ వెబ్ న్యూస్, 29 జూన్ 2026:

గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ మరియు జిపిఎస్ పాఠశాలల్లో పనిచేస్తున్న 1268 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయుల ఉద్యోగాల పునరుద్ధరణకు ప్రభుత్వం రెన్యువల్ జీవో జారీ చేసింది. ఈ ఉత్తర్వుల పట్ల రాష్ట్ర కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ జీవో విడుదలకు ప్రత్యేక సహకారం అందించిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసరావు నాయుడు, ఈస్ట్ వెస్ట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి.గోపి మూర్తి మరియు ఎస్టీ కమిటీ చైర్మన్ బొజ్జి రెడ్డిలకు సంఘం నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే తరుణంలో భవిష్యత్తులో తమ ఉద్యోగాలకు పూర్తి భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సిఆర్టి ప్రెసిడెంట్ డి. చిన్నయ్య, శైలజ, వైస్ ప్రెసిడెంట్ పద్మ, ప్రధాన కార్యదర్శి కృష్ణారావు మరియు రాష్ట్ర యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments