సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత

పాలకొండ వెబ్ న్యూస్, తేది: 23-06-2026 మంగళవారం.. పాలకొండ నియోజకవర్గంకి చెందిన లబ్ధిదారులకు అనారోగ్య కారణముగా, అత్యవసరంగా జరిగిన వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన చెక్కులను పాలకొండ నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో లబ్దిదారులకు ఎమ్మెల్యే నిమ్మక జయక్రిష్ణ అందజేశారు. దీనిలో భాగంగా పాలకొండ మండలం టి డి పారాపురం గ్రామంకి చెందిన కర్నేన మురళికి రూ.45900 రూపాయల విలువ గల చెక్కును అందజేశారు. అలాగే పాలకొండ మండలం బెజ్జి గ్రామంకి చెందిన పొట్టా అనురాధకు రూ.54194 రూపాయల విలువ గల చెక్కును, పాలకొండ మండలం కొండాపురం గ్రామానికి చెందిన సాసుపల్లి నారాయణ రావుకు రూ. 44395 రూపాయలు విలువ గల చెక్కును పాలకొండ లోని శాసన సభ్యుల క్యాంప్ కార్యాలయంలో అందచేశారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments