రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి

పాలకొండ వెబ్ న్యూస్, 24 జూన్ 2026:

పాలకొండ నియోజకవర్గం శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణను అభ్యుదయ రైతు, సీనియర్ సిటిజన్ ఖండాపు ప్రసాదరావు కలిశారు. సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో ఆయన ఎమ్మెల్యేకు ఒక వినతిపత్రం సమర్పించారు. తమ గ్రామమైన పీఆర్ రాజుపేటకు రహదారి సౌకర్యం లేదని, వెలగవాడ మీదుగా అత్యవసర వైద్య సదుపాయాలు, అగ్నిప్రమాదాల సమయంలో పెద్ద వాహనాలు వెళ్లడానికి వీలు లేకుండా పాత రహదారి ఆక్రమణకు గురైందని వివరించారు. దీనికి ప్రత్యామ్నాయంగా పీఆర్ రాజుపేట, ఓని గ్రామానికి తోటపల్లి ఎడమ కాలువ గట్టు మీదుగా గతంలో బళ్లు వెళ్లే రహదారి ఉందని తెలిపారు. కేవలం ఒక కిలోమీటరు దూరం ఉన్న ఈ రహదారిని నిర్మిస్తే ఓని గ్రామం అడ్డు రోడ్డు నుంచి పీఆర్ రాజుపేటకు మార్గం సుగుమమవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల పాలకొండ, ఓని, గుడివాడ, కోటిపల్లి, కొత్తూరు, సీతంపేట గ్రామాల గిరిజనులు సీతంపేట సంతకు వెళ్లడానికి దూరం తగ్గుతుందని వివరించారు. గిరిజనాభివృద్ధి సంస్థ ఇందుకు ఆమోదం తెలిపిందని, స్థలాన్ని సర్వే చేస్తే అంచనాలు వేస్తామని చెప్పినట్లు పేర్కొంటూ, ఈ రోడ్డును మంజూరు చేయాలని ఖండాపు ప్రసాదరావు కోరారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments