పాలకొండ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిత్య అన్నదాన పథకం గత 13 సంవత్సరాల నుండి దిగ్విజయంగా జరుగుతోంది. దాతల సహకారంతోనే ఈ పథకం అద్భుతంగా సాగుతోంది. ఇందులో భాగంగా పాలకొండ ప్రముఖ వ్యాపారవేత్త సుంకరి సుధాకర్ రావు తన తండ్రి అయిన కీర్తిశేషులు సుంకర లక్ష్మణరావు పేరున ప్రతి సంవత్సరం జూన్ 19వ తారీఖున అతని జయంతి రోజున పాతికవేల రూపాయలు నిత్య అన్నదానం పథకంనకు ఇస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరము కూడా అతని పేరున ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 25 వేల రూపాయలు సమితి సభ్యులకు అందించారు. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని, అటువంటి అన్నదానాన్ని సుమారు 20 గ్రామాలకు పైగా అన్నదానం కారు ద్వారా లబ్ధిదారులకు క్యారేజీలు అందిస్తున్నామని, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్లు, సహాయకులకు కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నామని సమితి నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కిషోర్, జి అర్ కె, ఎన్వీరమణ, శ్రీనివాస్, శేఖర్, పెద్దలు పాల్గొన్నారు.
news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in
0 Comments