పాలకొండ డిపో ఆర్టీసీ ఉద్యోగుల నిజాయితీని ప్రశంసించిన ప్రయాణికులు

పాలకొండ వెబ్ న్యూస్, జూన్ 19: విజయవాడ నుండి పాలకొండ వస్తున్న ఏపీ39యుటి 3577 నెంబర్ గల పాలకొండ డిపో సూపర్ లగ్జరీ బస్సులో తెనాలి ఐనపాలెం గ్రామానికి చెందిన ఒట్టిగుట్ట నాగేశ్వరరావు అనే ప్రయాణికుడు తన బ్యాగును మరిచిపోయి దిగిపోయారు. సదరు బ్యాగును గమనించిన బస్సు డ్రైవర్లు బంగారు నాయుడు, రమేష్ జాగ్రత్తగా పాలకొండ డిపోలో అప్పజెప్పారు. సెక్యూరిటీ సమక్షంలో బ్యాగ్ తెరిచి చూడగా అందులో మొబైల్ ఫోను, లక్ష రూపాయల నగదు, బట్టలు ఉన్నాయి. సెల్ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో ప్రయాణికుడి కుమార్తె కంకణాల జ్యోతి డిపోకు వచ్చారు. జిల్లా ప్రజా రవాణా అధికారి కే శ్రీనివాసరావు, డిపో మేనేజరు బిఎస్ఎన్ మూర్తి, అసిస్టెంట్ మేనేజర్ యు రమేష్, అసిస్టెంట్ ఇంజనీర్ ఎం చాణక్య, అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ ఎల్ రాము, ఏ డి సి బి కే మూర్తి, లీడింగ్ హ్యాండ్ టి శ్రీనివాసరావు, డ్రైవర్ ఇన్స్పెక్టర్ ఎస్ రవికుమార్ సమక్షంలో ఆ బ్యాగును ఆమెకు అందజేశారు. డ్రైవర్ల నిజాయితీని అందరూ అభినందించారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments