పాలకొండ వెబ్ న్యూస్, 29 జూన్, 2026: జ్యేష్ఠ పౌర్ణమి నాడు పాలకొండలోని జగన్నాథ స్వామి ఆలయంలో నేత్రాభిషేకం కార్యక్రమం నయనానందకరంగా జరిగింది. నేత్రాభిషేకం అనంతరం స్వామివారిని చీకటిగదిలో ఉంచారు. ఆ చీకటి గదిలో మహంతు, పూజారి మఠం విశ్వనాథ దాస్ స్వామివారి నేత్రాలను అభిషేకించారు. ఈ కార్యక్రమం ఆలయ కార్యనిర్వాహణాధికారి కే. పరమేశ్వరి పర్యవేక్షణలో జరిగింది. ఆషాఢమాసారంభాన ఉత్సవ మూర్తులుండని కారణంగా స్వామివారి మూర్తులను రథముపై నుంచి గుడిచిన గుళ్ల వద్దకు తీసుకువెళ్లారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in
0 Comments