పాలకొండ వెబ్ న్యూస్, 10 జూన్, 2026:ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించాలని తెలుగునాడు ఉపాధ్యాయ రాష్ట్ర సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ఆ సంఘం అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకటేశ్వర్లు మంగళవారం ఒక లేఖ రాశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న టెట్ సిలబస్‌లో ఉపాధ్యాయుల బోధనకు సంబంధం లేని అంశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులు ఈ సిలబస్ కారణంగా ఉత్తీర్ణత సాధించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.
కావున ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టును మాత్రమే సిలబస్‌గా నిర్ణయించాలని, అలాగే ఈ పరీక్షను ఆఫ్‌లైన్ విధానంలోనే నిర్వహించాలని వారు కోరారు. అందరికీ ఒకే విధమైన కనీస అర్హత మార్కులు ఉండేలా చూడాలని విద్యాశాఖ మంత్రిని కోరారు. ఈ ప్రత్యేక టెట్‌ను ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in
0 Comments