రైతు సమస్యలపై తక్షణమే స్పందించిన మంత్రి సంధ్యారాణి: పాలకొండలో ప్రత్యేక సమావేశానికి ఆదేశం

పాలకొండ వెబ్ న్యూస్, 09 జూన్ 2026:

​రైతాంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. పాలకొండ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు, రైతు సంఘం ప్రతినిధులు కృష్ణమూర్తి, బంటు దాసు, ఇద్దుబోయిన సింహాద్రి తదితరులు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డితో కలిసి తమ సాగునీటి ఇబ్బందులను మంత్రికి విన్నవించారు. తోటపల్లి ఎడమ కాలువ డిస్ట్రిబ్యూటరీలకు షట్టర్ల ఏర్పాటు, పద్మనాభ చెరువు మదుముల మరమ్మతులపై రైతులు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి అధికారులతో మాట్లాడి నిధుల సమస్య ఉంటే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మాట్లాడి ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి రైతు ప్రతినిధులు, అధికారులతో ఉమ్మడి సమావేశం నిర్వహించాలని పాలకొండ సబ్ కలెక్టర్‌ను ఆదేశించారు.

 వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments