పాలకొండ వెబ్ న్యూస్, 11 జూన్ 2026:భూ సమస్యల పరిష్కారానికి ఇదో చక్కని వేదికని తాసిల్దార్ రాధాకృష్ణమూర్తి అన్నారు. గురువారం మండలంలోని పద్మపురం గ్రామంలో ఒక గ్రామం నాలుగు వారాలు, నాలుగు సందర్శనలు అనే కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క భూ సమస్యను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గ్రామాల్లో భూ రికార్డులను కూడా సక్రమంగా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎవరికి ఎటువంటి భూ సమస్యలు ఉన్నా తమకు నిర్భయంగా తెలియపరచాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రి సర్వే డిటి మారుతీ రావు, మండల సర్వే శ్రీనివాసరావు మరియు ఇతరులు పాల్గొన్నారు.
వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in
0 Comments