ఎన్నికల హామీలు నెరవేర్చకుంటే ఉద్యమం: సిపిఎం

పాలకొండ వెబ్ న్యూస్, జూన్ 11...కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు విమర్శించారు. పాలకొండలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహిళలకు నెలకు 1500 రూపాయలు, నిరుద్యోగ భృతి, ఇళ్ల మంజూరు, జీవో నెంబర్ 3 పునరుద్ధరణ వంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ గాలికొదిలేశారని ఆరోపించారు. మన్యం జిల్లాలోని లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ, సాలూరు జూట్ మిల్లుల పునఃప్రారంభం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ వంటి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. స్థానిక మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు స్పందించి సూపర్ సిక్స్ హామీలతో పాటు జిల్లా సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఈ సమావేశంలో ఎం తిరుపతి రావు, ఎన్ వై నాయుడు, దావాల రమణారావు పాల్గొన్నారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments