రాష్ట్ర స్థాయి షైనింగ్ స్టార్ గా పాలకొండ విద్యార్థిని భువన ప్రతిభ

​పాలకొండ వెబ్ న్యూస్, జూన్ 26, 2026: ​పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివి 2026 మార్చి నెల పరీక్షల్లో 591 మార్కులు సాధించిన పెద్దింటి భువన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షైనింగ్ స్టార్ గా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పాఠశాల విభాగంలో ద్వితీయ స్థానము సాధించింది. ఈ అద్భుతమైన విజయాన్ని సాధించిన విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసరి నాగభూషణం, ఉపాధ్యాయులు, ఉప విద్యాశాఖ అధికారి కృష్ణమూర్తి మరియు మండల విద్యా అధికారి సోంబాబు ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాల విభాగంలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకొని నియోజకవర్గానికి మంచి పేరు తెచ్చిన భువన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments