పాలకొండలో వైసిపి సమీక్ష సమావేశం: ప్రతి ఓటును కాపాడుకోవాలి

పాలకొండ వెబ్ న్యూస్, 27 జూన్ 2026: ​పాలకొండ పట్టణ పరిధిలో సర్ ప్రక్రియపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెలమల మన్మధరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రస్తుతం పట్టణ పరిధిలో సర్ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని అన్నారు. ఈ సమావేశంలో వైసిపి మాజీ కౌన్సిలర్స్ కడగల వెంకటరమణ, కొడెం విజయ్ కుమార్, పల్లి లక్ష్మనాయుడు, దాశరెడ్డి మధు, దుంపల రమేష్ బాబు, భాసూరు కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments