కళింగాంధ్ర తొలి దళిత ఆత్మఘోష 'ఈర్నం'

పాలకొండ వెబ్ న్యూస్, జూన్ 21: తెలుగు సాహిత్య రంగానికి నాయకత్వం వహించే స్థాయిలో కళింగాంధ్ర ఉందని ప్రముఖ కవి, విమర్శకులు గుంటూరు లక్ష్మీనరసయ్య అన్నారు. ఆదివారం ఉదయం శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు సమావేశ మందిరంలో జరిగిన కలమట దాసు బాబు కవితా సంకలనం 'ఈర్నం' ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుస్తక ప్రచురణ బాధ్యత స్వీకరించిన చిగురుపల్లి చంద్రకళ స్మారక వేదిక చైర్మన్ సిహెచ్. ప్రభాకరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి గంటేడ గౌరు నాయుడు సంకలనాన్ని ఆవిష్కరించారు. దళితునిగా అనుభవించిన జీవితం, అవమానాలే దాసుబాబుతో ఈ 'ఈర్నం' మ్రోగించాయన్నారు. ఈ కవితా సంపుటిపై బాల సుధాకర్ 'దళిత కళింగం' పేరుతో రచించిన పరిశీలనాత్మక వ్యాసాన్ని ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దాసరి రామచంద్రరావు, చీకటి దివాకర్, కె. శ్రీనివాస్, అల్లాడ లక్ష్మి, నల్లి ధర్మారావు, సిరికి స్వామి నాయుడు, పక్కి రవీంద్రనాథ్, పీవీ నరసింహులు, అల్టి మోహనరావు తదితరులు హాజరై దాసు బాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

1 Comments

  1. Great job Sir for your contribution, palakonda people never forget 👌🎉👏

    ReplyDelete