పాలకొండ వెబ్ న్యూస్, 21 జూన్ 2026: విజయనగరం జిల్లా రేగిడి ఆముదాలవలస మండలం ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా స్థానిక తాసిల్దార్, ఎంపీడీవో, సంకిలి ఆయుష్ డిస్పెన్సరీ డాక్టర్ డి. మోహన్ రావు, కండ్యామ్ ఆయుష్ డిస్పెన్సరీ డాక్టర్ సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఒత్తిడితో కూడిన నేటి జీవన విధానానికి స్వస్తి పలకాలంటే యోగ అత్యంత అవసరమని అన్నారు. వయసుతో పని లేకుండా ప్రతి ఒక్కరు యోగా చేయవచ్చునని తాసిల్దార్ పేర్కొన్నారు. యోగ ఒక జీవన విధానమని డాక్టర్ డి. మోహన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగా టీచర్స్ ఎన్. నాగభూషణరావు, పి. ఉషారాణి, కండ్యాం యోగ టీచర్స్, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడి సిబ్బంది, సచివాలయ సిబ్బంది మరియు గ్రామ యువత భారీ ర్యాలీ నిర్వహించారు.news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in
0 Comments