రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి సాధించిన పాలకొండ స్టార్స్ బృందం

​పాలకొండ వెబ్ న్యూస్, 23 జూన్ 2026: శాఖా గ్రంథాలయం పాలకొండలో యోగాంద్ర-2026లో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి సాధించిన పాలకొండ స్టార్స్ బృందాన్ని ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రవేశపెట్టబడిన యోగాంద్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పోటీల్లో జల్లు విశ్వేశరరావు దర్శకత్వంలో, యోగ గురూజీ జనార్ధనరావు మాస్టర్ ఆధ్వర్యంలో రూపొందించిన యోగమానం లఘు చిత్రానికి రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి వచ్చింది. గిరిజన ప్రాంతంలో యోగ అవగాహన కల్పించడమే ఈ చిత్రం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా పాలకొండ తెలుగు యువత కార్యదర్శి సారిపల్లి సంతోష్, గ్రంధాలయ అధికారి బి గణేష్ బాబు నటీనటులను సత్కరించారు. మన పాలకొండ నటీనటులతో రూపొందించిన ఈ చిత్రానికి రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి రావడం ఆనందంగా ఉందని సంతోష్ అన్నారు. సమాజానికి చైతన్యం పరిచే మరిన్ని చిత్రాలు రూపొందిస్తానని డైరెక్టర్ జల్లు విశ్వేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నటీనటులు అనాదుల ఆనంద్, కృష్ణ వేణి, సిరి, బంగారు రాజు, అనాదుల శ్రీను, ఆనంద్ సాయి, రంప బ్రహ్మ, గోవర్ధన్ సాయి మరియు సిరికొండ ప్రజలు పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని viswa jallu యూట్యూబ్ ఛానల్ లో చూడవచ్చు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments