పాలకొండలో మరకత శివలింగానికి మాస శివరాత్రి ప్రత్యేక పూజలు

పాలకొండ వెబ్ న్యూస్, జూన్ 13, 2026: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ శిరిడి సాయి నగర్‌లోని శ్రీ షిరిడి సాయిబాబా సకల దేవతాలయంలో వెలసిన లలితా త్రిపుర సుందరి దేవి సమేత అమృత మృత్యుంజయ స్వామి ఆలయంలో మాస శివరాత్రి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, నయనానందకరంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠితమై ఉన్న అరుదైన మరకత శివలింగానికి ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను  నిర్వహించారు. శివయ్యకు అత్యంత ప్రీతికరమైన ఈ పవిత్ర పర్వదినాన సాయంత్రం వేళల్లో మరకత లింగానికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు జరిపారు. ​అనంతరం స్వామివారిని నూతన వస్త్రాలు, విశేష పుష్ప మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి, సహస్రనామ అర్చనలు చేశారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ స్వామివారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పించి, భక్తుల జయజయధ్వనాల మధ్య దసవిధ హారతుల సేవలను వైభవంగా ప్రదానం చేశారు. ఆలయ ధర్మకర్త పల్లా కొండలరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ విశేష పూజలను అర్చకులు పర్రి శరత్  భక్తిభావం ఉట్టిపడేలా నిర్వహించారు. మాస శివరాత్రి పురస్కరించుకుని ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలను స్వీకరించారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం:- https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments