ఐఐఐటీ ఫలితాలలో లక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినుల ఘన విజయం

పాలకొండ వెబ్ న్యూస్, జూన్ 13, 2026: ​శనివారం విడుదలైన ఐఐఐటీ ఫలితాలలో రేగిడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పాఠశాల నుండి నలుగురు విద్యార్థినులు ప్రతిష్టాత్మక ఐఐఐటీ సీట్లకు ఎంపికయ్యారు. వీరిలో మీసాల హాసిని, సుంకరి మౌనిక నూజివీడు ఐఐఐటీ క్యాంపస్‌కు ఎంపికవగా, ముగడ భవాని, నారు లక్ష్మీ ప్రియ శ్రీకాకుళం ఐఐఐటీ క్యాంపస్‌కు ఎంపికయ్యారు. ఒకే ప్రభుత్వ పాఠశాల నుండి నలుగురు విద్యార్థినులు ఈ ఘనత సాధించడం విశేషం. విద్యార్థినుల ప్రతిభను, వారి అద్భుతమైన ఎంపికను కొనియాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. సుధారాణి, గ్రామ పెద్దలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థినులు సాధించిన ఈ విజయం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments