ఆర్టీసీని ప్రైవేటీకరించే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలి: ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్

​పాలకొండ వెబ్ న్యూస్, 24-06-2026: ఏపీ పిటిడి (ఆర్టీసీ) లో విద్యుత్ బస్సులను పినాకిల్ సంస్థకు యాజమాన్యం చేసుకున్న ఒప్పందాలను వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వమే ఆర్టీసీ ద్వారా విద్యుత్ బస్సులను నడిపించాలని కోరుతూ పాలకొండ డిపో వద్ద ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ వావిలపల్లి రాజేష్, ఎల్ డి నాయుడు, డి జీరావు భారీ ధర్నా నిర్వహించారు. స్త్రీ శక్తి పథకం వల్ల కొత్త బస్సులు లేక ప్రయాణికులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, కొత్త బస్సులు కొనుగోలు చేసి ఖాళీలను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. 12 బస్ డిపోలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రక్రియను ఆపాలని, ఆన్ కాల్, అద్దె బస్సు డ్రైవర్లకు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి మెరుగైన జీతాలు ఇవ్వాలన్నారు. సుదీర్ఘకాలం పనిచేసిన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలని, డి ఏ ఏరియర్స్, లీవు ఎన్కాష్మెంట్ చెల్లించి, పి ఆర్ సి కమిటీ వేయాలని, సర్కులర్ 1/2019 ను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ నాయుడు, ఎంఎస్ నారాయణ, గ్యారేజ్ సిబ్బంది, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments