పాలకొండ మండలం అంపిలి గ్రామంలో వెలసియున్న శివాలయ ప్రతిష్ట సందర్భంగా ఈరోజు ఆధ్యాత్మిక దివ్య మహాసభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి ప్రధాన వక్తగా పాలకొండ సత్య సాయి సేవా సమితి ప్రతినిధి ఎన్వి రమణ పాల్గొని ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. శివపురాణంలోని ముఖ్య ఘట్టాలను, భగవద్గీత గురించి విశ్లేషించారు. శంకరుడు అనగా శుభకరమైన, మంగళకరమైన వాడని, 14 భువనాలను పరిపాలిస్తున్న పరమేశ్వరుడిని అందుకే పశుపతి అంటారని, అనగా 84 లక్షల జీవరాసులకు అధిపతి అని వివరించారు. பரమేశ్వరుని కుటుంబాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. శివుని వాహనం నందీశ్వరుడని, అమ్మవారి వాహనం సింహమని, వినాయకుడి వాహనం ఎలుకని, కుమారస్వామి వాహనం నెమలి అని, ఈశ్వరుడు ధరించే ఆభరణాలు పాములని తెలిపారు. ఇవన్నీ విరోధి జంతువులు అయినప్పటికీ ఐక్యమత్యంగా ఉంటున్నాయని, కనుక అందరూ ఐకమత్యంతో, ప్రేమ తత్వముతో మెలగాలని శివపురాణంలోని ముఖ్య ఘట్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in
0 Comments