పాలకొండ వెబ్ న్యూస్, జూన్ 22, 2026: పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ సీతంపేట ఐటీడీఏ ప్రాంగణంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పథకం కింద మంజూరైన వ్యవసాయ యంత్ర పరికరాలను గిరిజన రైతులకు పంపిణీ చేశారు. రైతులకు వ్యవసాయ విత్తనాలతో పాటు మత్స్య శాఖ ఆధ్వర్యంలో మోపెడ్‌లు, ఐస్ బాక్స్‌లు, చేపల వలలను అందజేశారు. గిరిజన రైతు, మత్స్యకార కుటుంబాల అభ్యున్నతే లక్ష్యమని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తామని నిమ్మక జయకృష్ణ తెలిపారు. రైతు బాగుంటేనే గ్రామం బాగుంటుందని ఆయన పేర్కొన్నారు.
0 Comments