ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేయాలి:టీడీపీ టౌన్ అధ్యక్షుడు గుమ్మడి సింహాద్రి

పాలకొండ వెబ్ న్యూస్, జూన్ 14: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రతి అర్హత కుటుంబానికి పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని టీడీపీ టౌన్ అధ్యక్షుడు గుమ్మడి సింహాద్రి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి ఆదేశాల మేరకు ఆదివారం పాలకొండ పట్టణంలోని 9వ వార్డులో వార్డ్ ఇన్‌చార్జి హనుమంతు తమ్మారావు ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గుమ్మడి సింహాద్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కొత్త పింఛన్ల మంజూరు, ఓటరు జాబితా చేర్పులు, వార్డు కమిటీల ఏర్పాటుపై చర్చించారు. వార్డు ఇంచార్జ్ హనుమంతు తమ్మారావు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మలాట స్వర్ణరాణి, దుమ్ముదు దుర్గారావు, తైలాపు సూర్యారావు, జన్నుల మోహన్ కుమార్ (బుజ్జి), ఆర్. గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గుమ్మడి సింహాద్రిని శాలువాతో ఘనంగా సన్మానించారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments