పాలకొండ నాగవంశం వీధిలో ఘనంగా జరిగిన భగవద్గీతా పారాయణం, సత్సంగ సమావేశం

పాలకొండ వెబ్ న్యూస్, 14.06.26: ​పాలకొండ నాగ వంశం వీధిలో ఉన్న రామాలయ ప్రాంగణంలో కంచుమోజు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో, బోను చిన్నమ్మలు, జల్లు నారాయణరావు పర్యవేక్షణలో గీతా పారాయణం, సత్సంగ సమావేశం జరిగింది. ఇందులో అనేకమంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలకొండ సత్యసాయి సేవా సమితి ప్రతినిధి ఎన్వీ రమణ మాట్లాడుతూ, మానవుడు పతనం అవడానికి కామము, క్రోధము, లోభము అనే మూడే కారణాలని, వీటిని ప్రతి ఒక్కరూ విడవాలని తెలియజేశారు. అనంతరం విశాఖపట్నం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ మారడాన నాగేశ్వరరావు రచించిన నేనెందుకు పుట్టాను? అనే పుస్తకాన్ని కంచుమోజు రామ్మోహన్ రావు ఆవిష్కరించారు. రామ్మోహన్ రావు ఆధ్యాత్మిక విషయాలను వివరించారు. అనంతరం వక్తులకు సన్మానం, నారాయణ సేవ జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎన్వి రమణ, కంచుమోజు రామ్మోహన్ రావు, డి యోగేశ్వరరావు, ఎమ్ నాగేశ్వరరావు, మర్రాపు మహేష్, జల్లు నారాయణ రావు, తుమ్మగుంట శంకర్రావు, జల్లు బాబ్జీ, కే బి ఏ నారాయణ సాయి, మజ్జి శంకర్రావు,  భాస్కర నాయుడు పాల్గొన్నారు.

news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments