విద్యార్థులకు ప్రత్యేక స్టూడెంట్ బస్సులు ఏర్పాటు చేయాలి: ఏఐఎస్ఎఫ్ డిమాండ్

​పాలకొండ వెబ్ న్యూస్, జూన్ 25: విద్యార్థుల ప్రయాణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరియు ఆర్టీసీ అధికారులు తక్షణమే ప్రత్యేక స్టూడెంట్ బస్సులను ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి శ్రీకాంత్ కోరారు. పాలకొండ కాంప్లెక్స్ కూడలి వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వందలాది మంది విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని, బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉందని శ్రీకాంత్ తెలిపారు. ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు లేకపోవడం వల్ల తరగతులకు ఆలస్యమవుతోందని వివరించారు. విద్యార్థుల భద్రత కోసం ప్రత్యేక స్టూడెంట్ బస్సులు, అదనపు సర్వీసులు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకుడు వికాస్, విద్యార్థులు పాల్గొన్నారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments