గిరిజన ప్రాంతాల్లో యోగ అవగాహన షార్ట్ ఫిల్మ్‌కు రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి

పాలకొండ వెబ్ న్యూస్, 21 జూన్ 2026: ​యోగ ఆంధ్ర 2026 రాష్ట్ర స్థాయి యోగ అవార్డుల్లో యోగ పై అవగాహన షార్ట్ ఫిల్మ్ సీనియర్ విభాగంలో రాష్ట్ర స్థాయి ప్రథమ బహుమతి తలవరం తెలుగు ఉపాధ్యాయులు కె. జనార్దన్ రావు కి లభించింది. గిరిజన ప్రాంతాల్లో వ్యసనాలకు గురి అయి ఆరోగ్యం పాడు చేసుకున్న కుటుంబాలకు యోగ పై అవగాహన కల్పించి, వారి ఆరోగ్యాలను యోగ ద్వారా ఎలా కాపాడుకోవాలో జల్లు విశ్వేశ్వర రావు దర్శకత్వంలో రూపిందించిన యోగ అమనం అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా చూపించినందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. గిరిజన కుటుంబాల ఆరోగ్యంపై యోగ ప్రభావం చూపిన విధానం ఈ షార్ట్ ఫిల్మ్‌లో అద్భుతంగా ఆవిష్కరించబడింది.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments