మున్సిపల్ ప్రైవేటీకరణ జీవోలను రద్దు చేయాలని వినతిపత్రం

పాలకొండ వెబ్ న్యూస్, 20-06-2026: మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు మరియు ప్రజలకు నష్టదాయకమైన 14 కీలక విభాగాల ప్రైవేటీకరణ విధానాన్ని ఉపసంహరించాలని, ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 975, 673లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎ పి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సి ఐ టి యు) పాలకొండ నగర పంచాయతీ కమిటీ ఆధ్వర్యంలో నగర పంచాయతీ కమిషనర్ గారికి వినతిపత్రం అందజేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు శాశ్వత స్వభావం కలిగిన విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికుల ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని వారు కోరారు. జూన్ 22వ తేదీన పురపాలక శాఖ మంత్రి పి నారాయణ గారి దగ్గరకు పాదయాత్ర ద్వారా చేపట్టనున్న రాయబార కార్యక్రమంలో పాలకొండ మున్సిపల్ సిబ్బంది అందరూ పాల్గొంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ పాలకొండ కమిటీ గౌరవ అధ్యక్షులు దావాల రమణారావు, ప్రధాన కార్యదర్శి సిహెచ్ సంజీవి, కోశాధికారి పి వేణు, కమిటీ సభ్యులు సిహెచ్ రఘు, విమల తదితరులు పాల్గొన్నారు.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments