పాలకొండలో రక్తదాన శిబిరానికి విశేష స్పందన

పాలకొండ వెబ్ న్యూస్, 14 జూన్ 2026:

​ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఆదివారం కోడదుర్గ ఆలయ సమీపంలోని కళ్యాణ మండపంలో నగర పంచాయతీ సమన్వయకర్త పల్లా కొండలరావు పర్యవేక్షణలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరాన్ని డి.ఎస్.పి ఎం రాంబాబు ప్రారంభించి, స్వయంగా రక్తం దానం చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, అపోహలు వీడాలని, ఏడాదికి ఒకసారి రక్తదానం చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. సమన్వయకర్త కొండలరావు మాట్లాడుతూ ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో సుమారు వందమందికి పైగా రక్తం దానం చేశారు. కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ నూకరాజు, ఏరియా సూపరిండెంట్ కే చిరంజీవి, బ్లడ్ బ్యాంక్ వైద్యులు శివ ప్రకాష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు దావల రమణారావు, టిడిపి పట్టణ అధ్యక్షులు గుమ్మడి సింహాద్రి, కడగల రమణ, తుమ్మగుంట శంకరు, అడపా బాబ్జి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలకొండ డిఎస్పి రాంబాబు  ఆధ్వర్యంలో పల్లా కొండబాబు  సహకారంతో  కోట దుర్గమ్మ తల్లి టెంపుల్ దగ్గరలో గల కళ్యాణ మండపంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 120 బ్లడ్ యూనిట్స్ ను బ్లడ్ సెంటర్ పాలకొండ మన్యం పార్వతీపురం జిల్లా వారు సేకరించడం జరిగింది.

​news by: BSS ప్రసాద్, పాలకొండ వెబ్ న్యూస్ వార్తల కోసం: https://www.palakondawebnews.in

Post a Comment

0 Comments