2026-27 విద్యా సంవత్సరానికి గాను 1264 ఆశ్రమ మరియు జిపిఎస్ పాఠశాలల సీఆర్‌టీల రెన్యూవల్స్ ఉత్తర్వులు ఇప్పించాలని, అలాగే ఉద్యోగులకు తగిన భద్రత కల్పించాలని కోరుతూ రాష్ట్ర యూనియన్ ప్రతినిధులు విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో గౌరవ ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ భార్గవి ఐఏఎస్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసరావు నాయుడు సమక్షంలో జరిగిన ఈ భేటీలో కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు రాష్ట్ర యూనియన్ ప్రెసిడెంట్ డి చిన్నయ్య సీతంపేట ఐటిడిఏ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ భేటీ ఎంతో దోహదపడుతుందని యూనియన్ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.
news by: BSS Prasad
0 Comments