వాతావరణ మార్పులపై ముందస్తు ప్రణాళికలతో సాగు చేయాలి: ఖండాపు ప్రసాదరావు

పాలకొండ వెబ్ న్యూస్, జూన్ 4, 2026:

​ముందస్తు ప్రణాళికతో సాగు చేస్తే పంట నష్టాలను తగ్గించుకోవచ్చని ఎల్‌నినో శాస్త్రవేత్త కేవీ రావు హెచ్చరిస్తున్నట్లు అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు తెలిపారు. జూన్ తొలకరి వర్షాలు చూసి తొందరపడి వరిసాగు చేయవద్దని, నీటి లభ్యతపై స్పష్టత వచ్చాకే పంటలు ఎంచుకోవాలని కోరారు. జూలై, ఆగస్టు నెలల్లో మధ్యంతర కరువు ముప్పు ఉన్నందున దీర్ఘకాలిక వరి రకాల సాగుపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నీటి భరోసా ఉంటేనే వరి వేయాలని, కరువును తట్టుకునే రకాలు, నీటి పొదుపు విధానాలు పాటించాలని సూచించారు. శాస్త్రవేత్తల హెచ్చరికలు ఉన్నా పాలకొండ నియోజకవర్గ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. లస్కర్ల నియమకం, మదుముల మరమ్మతులపై స్పందన లేదన్నారు. నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతే ఆ పాపం కూటమి నాయకులదేనని ప్రసాదరావు హెచ్చరించారు.

Post a Comment

0 Comments