పాలకొండ వెబ్ న్యూస్ | జూలై 26, 2026
పాలకొండలోని శ్రీ జగన్నాథ స్వామివారి వార్షిక రథయాత్ర మహోత్సవాలు నేడు ఆధ్యాత్మిక వైభవంతో ముగియనున్నాయి. తొమ్మిది రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ జగన్నాథ స్వామివారు, బలభద్రుడు, సుభద్రాదేవితో కలిసి తిరిగి శ్రీమందిరానికి చేరుకునే ఘట్టం భక్తులను విశేషంగా ఆకట్టుకోనుంది.
బహుడా యాత్రలో భాగంగా స్వామివారు ముందుగా దేవకీదేవి ఆలయం వద్దకు చేరుకుని, పిన్నమ్మ సమర్పించే సంప్రదాయ తవుడు రొట్టి ని నైవేద్యాన్ని శనివారం నివేదించారు. అనంతరం శ్రీమందిరం వద్దకు చేరుకోగానే, తొమ్మిది రోజుల పాటు తనను విడిచిపెట్టి వెళ్లారనే అలకతో మహాలక్ష్మీదేవి ఆలయ తలుపులు మూసివేస్తుంది.
ఈ సందర్భంగా జరిగే లక్ష్మీ–నారాయణ సంవాదం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తుతుంది. రసగుల్లాలు, పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారు అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు. ఆ తర్వాత లక్ష్మీదేవి స్వామివారిని ఆలయంలోకి ఆహ్వానించడంతో మహోత్సవం ఘనంగా ముగుస్తుంది.
ఈ దివ్య లీలా దాంపత్య జీవితంలో ప్రేమ, క్షమ, పరస్పర గౌరవం, అనురాగం ఎంత ముఖ్యమో తెలియజేసే ఆధ్యాత్మిక సందేశంగా నిలుస్తుంది.
ఆధ్యాత్మిక సందేశం:
"ప్రేమ ఉన్న చోట అలక కరిగిపోతుంది. క్షమ ఉన్న చోట ఆనందం నిలుస్తుంది. జగన్నాథ–మహాలక్ష్ముల దివ్య లీలా ప్రతి కుటుంబానికి ఐక్యత, ప్రేమ, ధర్మం అనే శాశ్వత సందేశాన్ని అందిస్తుంది."
0 Comments